అట్ట‌హాసం చేద్దామ‌నుకుంటే.. అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యిందా..? వెంక‌య్యా..?

cwa2gkqwgaaqd98

భారీ స్టేజీ.. వేదిక మొత్తం ల‌క్ష‌ల ఖ‌ర్చుతో అలంక‌ర‌ణ‌.. డ‌బ్బిచ్చి మ‌రీ జ‌నస‌మీక‌ర‌ణ‌.. ఇంత హ‌డావిడి చేస్తే.. అది కాస్తా సూప‌ర్ ఫ్లాప్ అయ్యింది.. కాకినాడ‌లో కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు గారి స‌భ హైలెట్స్ ఇవి.. కొత్త కాన్సెప్టులు ఏమీ లేకుండా., త‌న భ‌జ‌న ప‌రుల‌తో కాసేపు భ‌జ‌న చేయించుకుని., తానవంతుగా చంద్ర‌బాబుకి మ‌రికొంతసేపు తాళం వేసి., య‌ధావిధిగా జ‌నం చెవిలో పువ్వుపెట్టేద్దాం అనుకున్న ఆయ‌న పాచిక పార‌లేదు.. ఆయ‌న చెప్పే అబ‌ద్దాలు వినివిని దేవుడికి కూడా విసుగొచ్చేసి న‌ట్టుంది.. ఇక చాలు వెళ్ల‌మంటూ వ‌ర్షం కురిపించేశాడు.. లేక‌పోతే మాట‌ల్లో వ్యాక‌ర‌ణం త‌ప్ప వాక్‌శుద్ది లేని ఈయ‌న‌., జ‌న‌సేనానికి పోటీగా స‌భ పెడ‌తారంట‌..

ప‌వర్‌స్టార్ పిలుపుతో ఛ‌లో అనంత అంటూ ఓ వైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే., అబ్బో ఏపీ అన్నింటా ఫ‌స్ట్ అంటూ త‌న అధికారంతో త‌ప్పుడు నివేదిక‌లు., అవార్డులు ఇప్పించేసి అస‌లు వ్య‌వ‌హారాన్ని దారి మ‌ళ్లించాల‌ని చూస్తున్నారు.. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడారంట‌., పోట్లాడారంట‌.., ప‌ని జ‌ర‌గ‌లేదంట‌.. పోరాటం అంటే చివ‌రి వ‌ర‌కు చెయ్యాలి సార్‌.. పోట్లాడినా మాట విన‌క‌పోతే., మీరు ప‌ద‌విలో కొన‌సాగ‌డంలో అర్ధం ఏముంది.. నాటి ప్ర‌భుత్వం చ‌ట్టం చేయ‌లేదంటూ నిత్యం ఎదుటి వారిపై బుర‌ద చ‌ల్లే బ‌దులు., పూర్తి మెజార్టీ ఉన్న మీ స‌ర్కారుతో ఎందుకు చ‌ట్టం చేయించ‌లేక‌పోయారు.. ఇలా నిల‌దీస్తూ పోతే., వారిని మీ పైత్య‌పు ప్రాస‌ల‌తో నింధిస్తారా..? వెంక‌య్య గారు అందుకే మీ అబ‌ద్దాల‌ను ఆ దేవుడు కూడా హ‌ర్షించ‌లా.. పోనీలే వ్ర‌తం చెడినా ఫ‌లితం ద‌క్కింద‌న్న‌ట్టు., స‌న్మాన‌మ‌న్నా జ‌రిగిందిలే అని స‌రిపెట్టుకోండి..

ఇక కాకినాడ మీటింగ్‌లో అస‌లు హైలెట్స్ ఏంటంటే., మ‌నిషికి మూడు నుంచి ఐదొంద‌లిచ్చి త‌ర‌లించ‌డం., మ‌ధ్య‌లో ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ జ‌న‌సైన్యం తెలిపిన నిర‌స‌న‌.. కొత్త‌గా చెప్పుకునే అంశాలు ఇవే కావ‌డం కొస‌మెరుపు.. నాయుడుగారు లైట్ తీసుకోండి., జ‌నం రాళ్లు విస‌ర‌నందుకు సంతోషించండి.. ఇక నైనా ఏపీని వ‌ద‌లండి ప్లీజ్‌..

 46 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *