ఆశ‌..నిరాశ‌ల‌.. ”మూర్తి”త్వం..అటు..ఇటు..ఎటో..తెలియ‌ని సంపాద‌కీయం..!

rmurthy
తెలంగాణాలో పుట్టారు.. ఆంధ్రాలో క‌లం ప‌ట్టారు.. చంద్ర‌బాబు ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు గ‌న్నారు.. ఏదో ఆశించి… ద‌శ‌..దిశ‌లంటూ అన్న‌ద‌మ్ముల్లాంటి తెలుగువారి మ‌ధ్య అగ్గిరాజేశారు.. కేసీఆర్‌కి జై అన్నారు.. ఇప్పుడు జ‌గ‌న్ బుల్లెట్‌గా మారి ప్ర‌త్య‌ర్ధుల‌పై ప్రేలాప‌న‌లు చేస్తున్నారు.. జ‌ర్న‌లిజంలో మ‌ర్రిమానుగా పేరు తెచ్చుకున్నారు.. మీ నీడ‌న ఎదుగుదామ‌నుకున్న పాత్రికేయ మెక్క‌ల‌ని మారాకు తొడ‌గ‌నీయ‌కుండా చేశారు.. పైకి క‌లంపై ప్రేమ‌, లోప‌ల ఎవ‌రిపైనో జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.. నిత్యం ఎవ‌రో ఒక‌రి మెప్పుకోసం ప‌రుగులు., ఆ క‌లంలో ఇంకు అయిపోయినా., ఆగ‌ని క‌లలు.. ఏవండోయ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు రామ‌చంద్ర‌మూర్తిగారు.. మీ పాళీకి ఏ ద‌శ‌లోనూ క్లారిటీ లేదు.. కానీ మీరు యాజ‌మాన్యాల మెప్ప‌కోసం ప్ర‌త్య‌ర్ధుల ప‌ని ప‌డుతూనే ఉన్నారు.. పార్టీ పెట్టిన ఇంత కాలానికి, మీరు వైసీపీ ఇంటి ప‌త్రిక సాక్షీ చెంత‌న చేరిన సంద‌ర్భంగా, ఏపీలో మ‌రో ప‌వ‌ర్ పాయింట్‌గా మారిన జ‌న‌సేనానిపై స్కెచ్ క‌దిపారు.. అది ఎవ‌రి మెప్పుకోస‌మో చ‌దివిన పాఠ‌కుల‌కి విధిత‌మే.. అక్క‌డ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని ఆక్వా ఫుడ్ బాధితులు క‌ల‌సిన‌ప్పుడు మీరు అక్క‌డున్నారా.. అన్న‌చందంగా మీ క‌థ‌నం ఉంది.. అంతేకాదు ఓవైపు ఆయ‌న పుణ్యంతోనే మా పార్టీ ఓడిపోయింద‌ని ఒప్పుకుంటూనే., ఆయ‌న బ‌లాన్ని ప్ర‌శ్నించారు.. ఇంత‌కీ ప‌వ‌ర్‌స్టార్‌పై ఇంకు క‌క్కిన మీ పాళీ ఆశ‌యం నెర‌వేరిందా.. మీ సంపాద‌కీయం మీ ఓన‌ర్ గారి మెప్పుపొందిందా..? పొందే ఉంటుందిలే..! అయితే పిల్లి క‌ళ్లుమూసుకుని పాలు తాగుతున్నా., దాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉంటారు బీకేర్‌ఫుల్‌…

 74 total views,  5 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *