జ‌న‌సేనాని అడిగిందేంటి.. మీరు చెప్పేదేంటి.. అర్ధంకాలా సింగ్ గారు..

images-1

ప్ర‌త్యేక హోదా స్థానంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ అస‌లు ప్యాకేజీయే కాదు.. అవ‌న్నీ చ‌ట్ట‌ప్ర‌కారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులే.. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే చ‌ట్ట‌బ‌ద్ద‌త ఏది..? అంతా వంచ‌న‌.. న‌య‌వంచ‌న‌.. అనంత స‌భ‌లో స్ప‌ష్ట‌మైన తెలుగులో జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన మాట‌లు ఇవి.. నిపుణుల‌తో క‌లిసి పూర్తిగా అధ్య‌య‌నం చేసి కేంద్రం చెబుతున్న అద్భుత‌మైన ప్యాకేజీ గుట్టు బ‌హిరంగంగా ర‌ట్టు చేశారు.. అనంత స‌భ 10న జ‌రిగ్గా., ఈ వారం నుంచి ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చేందుకు ఒక్క క‌మ‌ల‌నాథుడు ముందుకి రాలేదు.. ఆయ‌న చెప్పిన మాట‌ల్లో నిజం ఉంది కాబ‌ట్టి.. ఏం చెయ్యాలో చెప్ప‌మంటూ స‌ల‌హా కోసం హ‌స్తిన పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కి వెళ్లారు.. ప‌వ‌న్ దెబ్బ‌కి తాము బ‌య‌టికి రాల‌కేపోతున్నాం అని మొర‌పెట్టుకున్నారు..

ఏం చేయాలి అని గ‌ట్టిగా ఆలోచించేసిన ఢిల్లీ క‌మ‌ల‌నాథులు., ఏదో ఒక కౌంట‌ర్ వేసేసి చేతులు దులుపుకుంటే పోలా అన్న‌ట్టుగా ఓ సెటైర్ వేసేశారు.. పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హారాలు చూస్తున్న సిద్ధార్ధ‌నాథ్ సింగ్ ధైర్యం చేసి ఆ ప‌నిని భుజాన వేసుకున్నారు.. కేంద్రం ఇస్తున్న ఆర్ధిక ప్యాకేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌న్నారు.. దాన్ని అర్ధం చేసుకోవాలి అన్నారు.. అంతేకాదు ప‌నిలో ప‌నిగా ఆయ‌న సినిమాల‌కు నిధులు ఏమైనా ఆల‌స్యంగా వ‌స్తున్నాయేమో అని సెటైర్ విసిరారు.. సింగ్ జీ.. మీరిచ్చింది అస‌లు ప్యాకేజీయేనా..? అయితే చ‌ట్ట‌బ‌ద్ద‌త ఏది..? ప‌న్నుల్లో రాష్ట్రానికి ద‌క్కాల్సిన వాటా ఎక్క‌డ‌..? మా సేనాని పూర్తిగా ఆర్ధం చేసుకున్నామ‌ని చెప్పారు.. ఆయ‌న చెప్పిందాన్లో త‌ప్పుంటే., అదేంటో ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు..

మీ వారి మెప్పుకోసం.. వారి ముందు పెద్ద‌మ‌డిసి త‌నం కాపాడుకోవ‌డం కోసం ఏదో ఓ గ‌డ్డ వేశాంలే అన్న‌ట్టు జ‌న‌సేనానిపై కౌంట‌ర్లు వేస్తే., మీ క‌టౌట్లు విరిగిపోగ‌ల‌వు జాగ్ర‌త్త‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వర్‌స్టార్ న‌టించిన ఏ చిత్ర‌మూ నిధుల కొర‌త‌తో ఆగిన దాఖ‌లాలు లేవు.. ఆయ‌న డేట్స్ దొరికితే చాలు., దాన్నే మ‌హ‌ద్భాగ్యంగా భావిస్తారు నిర్మాత‌లు.. ముందు ఆ విష‌యం మీరు తెలుసుకోండి.. అస‌లు హోదాని ప్యాకేజీగా మీరు ఎందుకు మార్చారో మాకంద‌రికీ తెలుసు.. ఆ నిధుల‌తో ఎవ‌రి జేబులు నిండుతాయో కూడా తెలుసు.. మీ జేబులు నింపుకునే ప్యాకేజీకి నిధులు విడుద‌ల చేసే గ‌తే మీకు లేదు.. మీరు జ‌న‌సేనాని సినిమాల గురించి మాట్లాడ‌టం ఏంటి..? అర్ధం ప‌ర్ధం లేని వ్యాఖ్య‌లు చేస్తే జ‌నం హ‌ర్షించ‌రు.. మా తెలుగు ప్ర‌జ‌లు అస‌లు హ‌ర్షించ‌రు.. మీకు ద‌మ్ముంటే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వండి.. అందుకు అవ‌స‌ర‌మైతే రాజ్యాంగాన్ని మార్చండి.. లేక‌పోతే అన్నీ మూసుకుని ఢిల్లీలో కూర్చోండి.. ఇది మా జ‌నం మాటేనండోయ్ సింగ్ గారు..

 64 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా …

3 comments

 1. చాలా బాగా వ్రాస్తున్నారు సర్.
  చాలా హ్యాపీ గా వుంది. మనకంటూ సోషల్ మీడియా లో నాలుగు మాటలు మంచిగా షేర్ చేస్కునే వీలు దిరికింది.
  వ్యతిరేక మీడియా ని కొంచెం అంటే కొంచెమయినా అణచగల వేదిక దొరికింది. ????

  ప్లీజ్ ఇంకా స్ట్రాంగ్ గా వ్రాయండి సర్. ????

  • thanq.. watch daily and promote our party web

   • CBN JAGAN BJP THO FIGHT CHAILI MAANAM. 2009 KANTA CHALA KASTAM APPUDU PRP FAILURE CHUSAM SO BE CAREFULL FRIENFS. SOCIAL MEDIA NI CORRECT GA — USE CHAILI. PRATHI OKKARINI MANA SENA HAKKUNA CHACHUKOVALI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *