భావనపాడులో జనసేన నేత పర్యటన.. సమస్యల పరిష్కారానికి హామీ

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలోని తీరప్రాంత గ్రామం భావనపాడులో జనసేన పార్టీ నాయకులు కణితి కిరణ్ పర్యటించారు. పోర్టు నిర్మాణంతో పాటు స్థానిక సమస్యలపై అధ్యయనం చేశారు. షార్జాలో రెండు నెలల క్రితం మృతి చెందిన తామాడ అప్పారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతదేహం ఇప్పటికీ ఇంటికి చేరలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా స్థానిక జనసైనికులు కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అదే ఘటనలో కోమాలోకి వెళ్లిన కారాడ మోహనరావు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. బాధితుని క్షేమ సమాచారం తెలియడం లేదన్న కుటుంబ సభ్యుల ఆవేదన విన్న కిరణ్, ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి విషయాన్ని తెలియపరచి, త్వరలో వివరాలు అందిస్తామని వెల్లడించారు.
అటు భావనపాడు పోర్టు స్థల పరిశీలన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిన నేపధ్యంలో ఆ గ్రామ యువత, పెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్యాకేజీలో భాగంగా వారి డిమాండ్లను ఆలకించారు. ఈ సందర్భంగా సమీప గ్రామం సెలగపేట యువత తమ గ్రామ పరిధిలో 80 ఎకరాల్లో ఉన్న చెరువులను పోర్టు పరిధి నుంచి తప్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని జనసేన పార్టీ నాయకులకు అందచేశారు. గతంలో తిత్లీ తుపాను సమయంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపధ్యంలో అక్కడ ప్రజల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెవెళ్లేందుకు, పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఆయన రాకతోటే తమకు నష్టం వాటిల్లిన విషయం బాహ్యప్రపంచానికి తెలిసిందని తెలిపారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కణితి కిరణ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక జనసైనికులు నర్శిపురం శేఖర్, లమ్మత శ్రీనివాస్, యడియూరు చిన్నారెడ్డి, భీమరావు లింగుడు తదితరులు పాల్గొన్నారు.

 54 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆచారాల ఉల్లంఘనపై జనసేన-బీజేపీ నిరసన

ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *