వెలుగోడు అత్యాచార బాధితురాలికి అండగా జనసేన-బీజేపీ ఆందోళన.. ఎస్సైపై వేటు

• ముగ్గురు నింధితుల అరెస్ట్
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని జనసేన, భారతీయ జనతా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. భర్త చూస్తుండగానే దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసుల స్పందనపై విమర్శలు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. చట్టాల డొల్లతనంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన సూచన మేరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు స్థానిక నాయకులు రంగంలోకి దిగారు. బాధితురాలు చికిత్స జరుగుతుండడంతో పాటు జిల్లాలో కరోనా ఉదృతంగా ఉండడంతో ఆమెను కలిసేందుకు అధికారులు నిరాకరించారు. ఈ నేపధ్యంలో బాధితురాలి భర్తను జనసేన-బీజేపీ నాయకులు కలసి పరామర్శించారు. ఘటన చోటు చేసుకున్న సమయంలో నింధితుల దాడిలో అయిన గాయాలను పరిశీలించారు. న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
నింధితులని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు కేసు తారుమారు చేసేందుకు ప్రతయ్నం చేసిన ఎస్.ఐ.పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జనసేన-బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వీరి ఆందోళన నేపధ్యంలో ఎస్.ఐ.ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నింధితుల్లో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ చైర్మన్, ఎమ్మిగనూరు ఇంఛార్జ్  రేఖా గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ జనసేన పార్టీ  శ్రీరాములు,  శాలు భాషా,  సిల్వరి వెంకటేష్,  పురుషోత్తం గౌడ, వీరమహిళా  రేష్మ, బీజేపీ ST మోర్చా రాష్ట్ర ఉపధ్యక్షులు రామచంద్ర నాయక్, OBC మోర్చా జిల్లా జెనరల్ సెక్రటరీ  GV రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 82 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆచారాల ఉల్లంఘనపై జనసేన-బీజేపీ నిరసన

ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *