సాక్షీ గూట్లో వాలిన కొమ్మినేని.. మీ వైసీపీ ప‌లుకుల్లో పాత్రికేయ విలువ‌లెక్క‌డ‌…?

తెలుగు ఎల‌క్ట్రానిక్ మీడియాలో ”ల‌బ్ది” ప్ర‌తిష్టుడైన పాత్రికేయుడిగా కేఎస్ఆర్‌గా చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాస‌రావుకి మంచి పేరు.. ల‌బ్ది ఎక్క‌డ ఎక్కువ‌గా ఉంటే అక్క‌డ వాలిపోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.. ఎన్‌టీవీ నుంచి మారిన‌ప్పుడు ఈయ‌న‌గారి పాత్రికేయం గురించి చాలా పొగ‌డ్త‌లే విన‌బ‌డ్డాయి.. జ‌గ‌న్‌తో స‌హా ఎవ‌రినైనా విమ‌ర్శించే అవ‌కాశం ఇస్తేనే చేర‌తాన‌న్నాడ‌ని చెప్పుకున్నారు.. వాస్త‌వానికి ఆమాట‌లు కొమ్మినేని వారి డ‌బ్బా నుంచి జాలువారి ప్ర‌చారం జ‌రిగిన‌వే.. సాక్షీలో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న చేస్తుందేంటో జ‌నం చూస్తూనే ఉన్నారు.. ఒక ఏ గూటి ప‌క్షి ఆ గూటి ప‌లుకులే ప‌లుకుతుంద‌న్న చందంగా., ఈ కొమ్మినేని వారు ఏ కొమ్మ‌పై వాలితే., ఆ కొమ్మ వాటానికే నిల‌బ‌డ‌తారు.. పైకి మాత్రం చెప్పేవి శ్రీరంగ నీతులు అన్న చందంగా., తెలుగునాట త‌న‌ను మించిన నిజాయితీ ప‌రుడైన పాత్రికేయుడు లేడ‌న్న‌ది ఆయ‌న ఫీలింగ్‌.. నువ్వు మిస్ట‌ర్ క్లీన్ అయితే., మాస్ట‌ర్ ఆఫ్ స్కామ్స్‌గా పిల‌వ‌బ‌డుతున్న జ‌గ‌న్ గూటికి ఎందుకు చేరావు.. ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌ల నోట్లు ఎలా తీసుకుంటున్నావు.. ఇవి మా వాళ్లు అడుగుతున్న ప్ర‌శ్న‌లు..

ఇక పాత్రికేయ విలువ‌ల విష‌యానికి వ‌స్తే.. మీ పొలిటిక‌ల్ కామెంట్‌., ప‌క్కా మీ యజ‌మాని ప్రోటోకాల్ కామెంట్‌లా త‌యారైంద‌న్న‌ది నూటికి నూరుపాళ్లు నిజం.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ స‌భ‌పై మీరు రాసిన అక్ష‌ర అస‌త్యాలే అందుకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌.. అయ్యా కొమ్మినేని వారు అనంత స‌భ సూప‌ర్ హిట్ టాక్ రావ‌డం వ‌ల్ల‌., మీ య‌జ‌మాని క‌డుపుబ్బు., మీ పెన్నులో ఇంకై ఇలా బ‌య‌టికి క‌క్కిందా.. ఏమ‌న్నారు ప‌వ‌న్ కొంచెం భ‌యంగా, బెరుకుగా మాట్లాడారా.. మీ క‌ళ్ల‌జోటికి సాక్షీ తెర‌లు అడ్డుప‌డుండొచ్చు గాక‌., చెవులు ఏమ‌య్యాయండి.. దిక్కులు పిక్క‌టిల్లేలా., ల‌క్ష‌లాది మంది జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య‌., ఆరంభం నుంచి ఆఖ‌రి మాట వ‌ర‌కు ఆయ‌న ప్ర‌సంగం అంత వాడివేడిగా సాగితే., ఈ ఫ్యాను కూత‌లు ఏల‌..? ప్యాకేజీ పాఠం చ‌ద‌వ‌డానికి గాని., అర్ధం చేసుకోవ‌డానికి గాని ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని జ‌న‌సేనాని ఎక్క‌డైనా చెప్పారా..? త‌న స‌భ ఆల‌స్యానికి కార‌ణంపై ఆదిలోనే అంత స్ప‌ష్ట‌త ఇస్తే., అది మీ చెవిని చేర‌లేదా..?

మా సేనాని క‌నీసం ఇప్ప‌టికైనా ప్యాకేజీలో ఉన్న మోసాన్ని బ‌య‌ట‌పెట్టారు.. గౌర‌వ ప్ర‌తిప‌క్ష నేత అయిన మీ య‌జ‌మానికి ఈ విష‌యం అస‌లు తెలుసా..? తెలిస్తే ఎందుకు ఎప్పుడూ ప్ర‌స్తావించ‌లేదు.. ప్యాకేజీ ప్ర‌క‌టించిన నాటి నుండి అనంత స‌భ వ‌ర‌కు ఏ ఒక్క‌రైనా అది అస‌లు ప్యాకేజీ కాదు అన్న విష‌యాన్ని బ‌య‌టికి చెప్పారా..? ఎవ‌రికీ సాధ్యం కానిది జ‌న‌సేనానికి సాధ్య‌మైంద‌న్న అక్క‌సా.. ఇప్ప‌టికే బీజీపీ, టీడీపీల‌పై ప‌వ‌న్ పూర్తి స్థాయిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.. ఆ పార్టీలు జ‌న‌సేనానికి ఎదురొచ్చే సాహ‌సం చేయ‌క‌పోతే అది ఎవ‌రి త‌ప్పు.. విష‌యం తెలిసీ ఇలాంటి త‌ప్పుడు కూత‌లు కూయ‌డం ఏ ర‌క‌మైన పాత్రికేయం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అస‌లు ఇంకా రాజ‌కీయాల్లోకే రాలేద‌న్నారు.. రాజ‌కీయాల్లోకి రావ‌డం అంటే మీ దృష్టిలో ఏం చేయాలి.. అర్ధంప‌ర్ధం లేని వ్యాఖ్య‌ల‌తో నిత్యం ఎదుటి వారిపై దుమ్మెత్తి పోయాలా..? లేక ఎప్పుడు ఎవ‌రు ఖాళీగా దొరుకుతారా..? వారి ఉద్య‌మాల్ని, క్రెడిట్‌ని హైర్ చేసి ల‌బ్ది పొందుదామా అని ఎదురుచూడాలా..? పార్టీ బ‌రిలోకి దిగే విష‌యం అంత స్ప‌ష్టంగా చెబితే., పొత్తుల మేట‌ర్ మాట్లాడ‌తారెందుకు., ఎన్నిక‌ల‌కి రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది., ఈ లోపు ఎలాంటి ప‌రిణామాలైనా సాధ్య‌మే., అలాంట‌ప్పుడు ఏళ్ల త‌ర‌బ‌డి ఎన్నో ర‌కాల రాజ‌కీయాల‌ను చూసిన మీరు ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఏం జ‌ర్న‌లిజం.. గెలిచేస్తాం.. పొడిచేస్తాం అని మీ సారు చెప్పిన‌ట్టు చెప్ప‌మంటారా..? స‌్టేజ్ ఎక్క‌డం ద‌గ్గ‌ర్నుంచి తిరిగి వెళ్లే వ‌ర‌కు అంత ధైర్యం, ద‌ర్పం క‌న‌బ‌రిచిన వ్య‌క్తి వెనుదిరిగి పారిపోతాడంటూ పిచ్చిరాత‌లు రాయ‌డానికి మీ పెన్నుకి మ‌న‌సెలా ఒప్పింది.. మీ లాంటి సీనియ‌ర్లకు ల‌క్ష‌ల కొద్ది ఇచ్చే జీతాలు న‌ల్ల‌ధ‌న‌మే అయినా., మీరు కాస్త తెల్ల‌టి జ‌ర్న‌లిస్టుల్లా ప్ర‌వ‌ర్తిస్తే., ప్ర‌జ‌లు స్వీక‌రిస్తారు.. లేకుంటే ఛీ కొడ‌తారు.. మీ పొలిటిక‌ల్ కామెంట్‌లో నిజాలు చెప్పండి సార్‌..

 48 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *