రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఎన్.ఆర్.ఐ. జనసేన ఆర్ధిక సాయం

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తలను స్మరించుకుంటూ స్థానిక పార్టీ శ్రేణులు సంస్మరణ సభ ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది జనసైనికులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న నేపధ్యంలో అంతా స్వీయ భద్రత పాటించాలని దిశానిర్ధేశం చేశారు. మృతి చెందిన జనసైనికుల సేవలను స్మరించుకున్నారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన జనసైనికుడు …

Read More »

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్ధిక సాయం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త  పెడితేగంటి రాఘవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్  తాడిశెట్టి నరేష్ శనివారం జనసైనికులతో కలసి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తనవంతు రూ. 10, 000 ఆర్ధిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా  నరేష్ మాట్లాడుతూ.. రాఘవులు మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. …

Read More »

పొరుగు రాష్ట్రాల్లోనూ జనసేన ‘జనసేవ’. కర్ణాటకలో 60 పేద కుటుంబాలకు నిత్యవసరాలు

జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్ స్ఫూర్తితో సాగుతున్న జనసేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలను దాటి పొరుగు రాష్ట్రాలకు సైతం పాకాయి. జనసైనికులు,  పవన్ కల్యాణ్ అభిమానులు కష్టాల్లో ఉన్న నిరు పేదలను ఆదుకునే క్రమంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రంలో 60 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాన …

Read More »

పొన్నూరులో వాడవాడకు జనసేన జెండా కార్యక్రమం

• పోస్టర్ విడుదల క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు జనసేన జెండాను రెపరెపలాడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. వాడ వాడకు జనసేన జెండా పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన …

Read More »

కర్నూలు కలెక్టరేట్ ఎదుట జనసేన శ్రేణుల ధర్నా..

జీ+3 గృహాలు తక్షణం లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క నిరు పేదకు సైతం ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయిందనీ, వారు కట్టించకపోగా అప్పటికే నిర్మించి ఇళ్లను సైతం కేటాయించకుండా లబ్దిదారులను ముప్పుతిప్పలు పెడుతోందని జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త కమిటీ సభ్యురాలు  రేఖా గౌడ్ ఆరోపించారు. ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన జీ+3 గృహాలను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట బాధితులు, …

Read More »

తుంగభద్ర పుష్కరాలకు జనసేనానికి మంత్రాలయం మఠం నుంచి ఆహ్వానం

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలకు విచ్చేయవలసిందిగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. శనివారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ సుభుదెంద్రతీర్థ స్వామీజీ స్వయంగా ఫోన్ చేసి జనసేనానిని  ఆహ్వానించారు. మఠాధిపతి తరఫున నరసింహమూర్తి వచ్చి పవన్ కల్యాణ్ కి ఆహ్వాన పత్రిక, శ్రీ రాఘవేంద్ర స్వామి …

Read More »

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం  మియాపూర్ వెళ్లాల్సి ఉండగా, ఆయన వాహస శ్రేణి వదిలి మెట్రో రైలు ఎక్కరు. మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు జనసేనాని ప్రయాణం సాగింది. మార్గం మధ్యలో ప్రయాణికులతో ముచ్చటించారు. జనసేన అధినేతతో పాటు చిత్ర …

Read More »

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

• GHMC ఎన్నికలపై చర్చ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ నాయకత్వం సన్నాహక సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. వరుసగా రెండో రోజు GHMC పరిధిలోని డివిజనల్ కమిటీలతో పార్టీ నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని వీర మహిళా నేతలతో …

Read More »

గాజువాక మైనర్ బాలిక కుటుంబానికి జనసేన నేతల పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

రెండు రోజుల క్రితం గాజువాక, శ్రీనగర్ కాలనీలో హత్యకు గురయిన మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. జనసేన అధినేత  పవన్ కల్యాణ్ సూచన మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్  పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు, స్థానిక నాయకులు బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున సానుహూతి తెలిపారు. వారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు  …

Read More »

శ్రీవారి దర్శనార్థం వచ్చిన సామాన్య భక్తులను ఇబ్బందుల పాల్జేస్తారా?

• ట్రస్టు ఆదాయం కోసం సామాన్య భక్తులను గంటల తరబడి నిలబెడతారా? • జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ధ్వజం శుక్రవారం తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం పట్ల జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ విచారం వ్యక్తం చేశారు. రోజు వారీ దర్శనాల సంఖ్య 3 వేల నుంచి 25 వేలకు పెంచినప్పటికీ సామాన్య భక్తుల కోటా మూడు …

Read More »