అమిత్ షాకి కరోనా..త్వరగా కోలుకోవాలంటూ జనసేనాని ప్రార్ధన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా సోకింది.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించినట్టు, పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు..
హోంమంత్రికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గౌరవ హోంమంత్రి అమిత్ షాజీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మనమంతా మన్ఫూర్తిగా ప్రార్ధిద్దామని పిలుపునిచ్చారు. త్వరలోనే ఆయన దేశ సేవకు తిరిగి వస్తారని ఆకాంక్షించారు.

అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు..

 86 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *