రెండు రోజుల క్రితం గాజువాక, శ్రీనగర్ కాలనీలో హత్యకు గురయిన మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు, స్థానిక నాయకులు బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున సానుహూతి తెలిపారు. వారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు పవన్ కల్యాణ్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఆడపిల్లల భద్రత వ్యవహారంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అందరిదీ ఒకటే పంధాగా ఉందని ఈ సందర్భంగా శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ స్పష్టం చేశారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మైనర్ బాలిక హత్య జరిగి రెండు రోజులు గడుస్తున్నా నింధితులపై చర్యలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒత్తిళ్లకు లొంగకుండా ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీర మహిళలు మురళీ దేవి, అడబాల లక్ష్మి, కళావతి, దుర్గ, కళా, పార్టీ నాయకులు శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
34,012 total views, 204 views today