భావితరాల భవిష్యత్ కోసమే పార్టీని స్థాపించానని చెప్పే జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం స్థాయి ఏంటో జాతీయ విద్యా విధానం 2020 ద్వారా నిరూపితం అయ్యింది. జాతీయ విద్యా విధానానికీ, పవన్ కల్యాణ్ ఆలోచనలకు సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి డాక్టర్ రమేష్ ఫోక్రియాల్ చేసిన ట్వీట్.. ఆధునిక విద్యా విధానంలో అమలు చేయాల్సిన సంస్కరణలపై జనసేన అధినేత చేసిన సూచనలకు పరిగణలోకి తీసుకున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఆయన ట్వీట్ ని కూడా పేటీఎం బ్యాచ్ ట్రోల్ చేసే అవకాశం ఉందని గ్రహించారో ఏమో? అందుకు సాక్ష్యాన్ని కూడా కింద వీడియో రూపంలో జోడించారు.
గత ఏడాది విద్యావిధానంపై జనసేన ప్రణాళికలు అనే అంశం మీద జనసేనాని మాట్లాడిన వీడియో సందేశం అది. డాక్టర్ రమేష్ ఫోక్రియాల్ చేసిన ట్వీట్ తో రెండు అంశాలు బయటపడ్డాయి. ఒకటి పవన్ కల్యాణ్ విజన్ స్థాయి ఏ పాటిది అన్న అంశం.. రెండోది నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆయన మాటకు ఉన్న విలువ ఏంత? అనే ప్రశ్నకు బదులు దొరికింది. జనసేన పార్టీ-బీజేపీ కలయికపై ప్రత్యర్ధులు ప్రజల్లో సృష్టిస్తున్న అపోహలకు కూడా సమాదానం లభించినట్టయ్యింది.
25 సంవత్సరాల రాజకీయ.. ఒక జనరేషన్ కి ఉపయోగపడే రాజకీయం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఆయన విధానాలు.., పార్టీలకు, నాయకులకు, కులం సంఘాలకు కట్టుబడి చేసే రాజకీయవాదులకు అర్ధం కాకపోవచ్చు. రుచించకపోవచ్చు కూడా.. ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి. ఏ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం.., సంక్షేమ పథకాల ముసుగులో చిల్లర పైసలు జనానికి విసిరి ఓట్లు వేయించుకునే విధానాలకు భిన్నమైనదే. ఇచ్చిన మొత్తాన్ని ఏ రూపంలో వెనక్కి తీసుకోవాలి.. జనాన్ని ఏ స్థాయిలో దోచుకోవాలి అనే విధానాలకు సైతం వ్యతిరేకమే. కుటుంబంలో ఒక్కరికి రూ. 10 వేలు ఇచ్చి, సభ్యులందరి నెత్తిన తలో రూ. 10 వేలు అప్పు జోడిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాలను జనసేన వ్యతిరేకించడానికి కారణాలు ఉన్నాయి.
పంచాయితీ ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చి గెలిచాం, మున్సిపల్ ఎన్నికల ముందు జగనన్న నేస్తం ఇచ్చాం, మరో ఎన్నికల ముందు మరో పథకం ఇచ్చాం అంటూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు నేట పాలకులు. ఈ అప్పుల వల్ల పాలకుల నెత్తిన పడే భారం కంటే, ప్రజల నెత్తిన పడే భారమే ఎక్కువ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయాలన్నదే ఆయన తపన. అదే సమయంలో ఏడాదిలో ఒక్కసారి ఇచ్చే రూ. 10 వేల కోసం వేచిచూడకుండా, నెలకు రూ. 10 వేలు సంపాదించుకునే అవకాశాలు కల్పించాలన్నదే ఆయన విధానం. ప్రజల్ని పాలకులు సోమరులుగా మారుస్తున్నారు అంటే… మీకు అయాచితంగా ప్రభుత్వం డబ్బు ఇస్తానంటే దాన్ని పాడు చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తారు. అదే డబ్బుని కరెంటు బిల్లులు, ఇసుక, మద్యం విధానాల ముసుగులో వెనక్కి లాగేసుకుంటారు.
జనసేన అధినేత అలాంటి ఇనిస్టెంట్ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మార్పు కోసం.. ఓ తరాన్ని ఈ తరహా దోపిడి రాజకీయాలకు దూరంగా తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నవి విమర్శకులు సైతం ఒప్పుకుంటున్న అంశం.
ఇంతకీ అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంలాటి విద్యా విధానం కావాలని కోరుకున్నారంటే… ఫిలిప్పెయిన్స్ తరహా విద్యా విధానం, విద్యార్ధిపై ఒత్తిడి తగ్గించే విధానం. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దాలని చూసినప్పుడు కేవలం జనసేన పార్టీ మాత్రమే ఖచ్చితమైన వైఖరి ప్రకటించింది. ఏ మాధ్యమం ఎంచుకోవాలి అన్న స్వేచ్చ విద్యార్ధికి, విద్యార్ధి తల్లిదండ్రులకు ఉండాలన్న స్టాండ్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టి వేసింది.
అర్ధం పర్ధం లేని పాతకాలపు విద్యావిధానం వల్ల వృత్తి విద్యా విధానం దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అదే సమయంలో భాష కూడా నిరాదరణకు గురైంది. విద్యార్ధులను ఒత్తడికి గురి చేసే విధానం తీసుకుంటే సైన్స్, లేదంటే ఆర్ట్స్ అన్న మూస ధోరణిని ఆయన ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వచ్చారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు కోరుకున్నారు. ఆయన విజన్ కి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలజీ -2020లో.. ఆయన ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవడం మరోసారి ప్రస్థావనార్హం. భారత్ ను ఓ సరికొత్త వైజ్ఞానిక సమాజంగా రూపకల్పన చేయడానికి ఇవి అవసరం. బంగారు భారతావని ఆవిష్కరించే క్రమంలో ఓట్లు-నోట్ల రాజకీయాల కోసం కాక, ఓ స్పష్టమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లే నవతరం నాయకుడిని స్వాగతించాల్సిన బాధ్యత.. భావి భారత పౌరుల్ని కన్న ప్రతి తల్లితండ్రిలో ఉంది.
30,736 total views, 52 views today