జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

* త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్
74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు శ్రీ షేక్ రియాజ్, శ్రీ వై.నగేష్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
* మంగళగిరి కార్యాలయంలో…
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ పి.ఎ.సి సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీమతి పార్వతి నాయుడు, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 1,176 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *