నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతంపై స్థానిక జనసేన నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ సిద్దాంతాలు, విధానాలను వివరిస్తున్నారు. పీఏసీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తరఫున కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల పరిధిలోని వావిళ్ల గ్రామంలో స్థానిక మత్సకారులతో పార్టీ యువనాయకత్వం సమావేశం నిర్వహించింది. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా జిల్లా కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్న భరోసా ఇచ్చారు.
సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై 40 మంది మత్సకారులు కుటుంబాలతో సహా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీకి సంబంధించి కార్యక్రమాల వివరాలు, భవిష్యత్ కార్యచరణ ఎప్పటికప్పుడు కార్యవర్గానికి తెలియ చేస్తామని నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో గురుకుల కిషోర్, డాక్టర్ అజయ్, సుధీర్ బద్దిపూడి, శ్రీనాథ్, ప్రసాద్, పవన్, వినయ్, ప్రశాత్ గౌడ్, విక్రాంత్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
4,130 total views, 12 views today