వజ్రోత్సవాలను శోభాయమానంగా జరుపుకొందాం-జనసేనాని సందేశం

74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ జాతికి జనసేన అధినేత్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ లేకుంటే అంగరంగ వైభవంగా జరుపుకునే వాళ్లమని., త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది వజ్రోత్సవాలను అత్యంత శోభాయమానంగా జరుపుకుందామన్నారు.. జనసేనాని స్వతంత్ర దినోత్సవ సందేశం పూర్తి పాఠం..
ఒక అనిర్వచనీయమైన ఉత్తేజం కలిగించే వేడుక. కులమతాలకు అతీతంగా భారతీయులు అందరూ జరుపుకొనే ఒక మహత్తరమైన పండుగ. రెండు వందల ఏళ్ల పాటు సాగిన పరాయి పాలనలో ఎన్నో అకృత్యాలను భరత మాత చవి చూసింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వారి త్యాగాల ఫలితంగా భరత మాత దాస్య శృంఖలాలు తెగిపడ్డాయి. అందుకు గుర్తుగా మన త్రివర్ణ పతాకం నింగిలో రెపరెపలాడింది. ఇంతటి విశిష్టమైన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయలు అందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకు స్వతంత్రం సిద్ధించి 73 వసంతాలు పూర్తి అయ్యాయి. ఇది 74వ వేడుక. ఆగస్టు 15 వస్తుందంటేనే దేశం అంతా శోభయామానంగా వెలిగిపోయేది. కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకొనేవాళ్ళం. అయితే ఈసారి కోవిడ్ మహమ్మారి మనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేలాది మందిని బలి తీసుకుని, లక్షలాది మందిని పట్టి పీడిస్తోంది. ప్రజల బాధలు వింటుంటే గుండె భారంగా మారిపోతోంది. దేవుడ్ని ప్రార్ధించడం తప్ప ఏమి చేయలేకపోతున్నాము. ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ క్రీనీడ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలపై కూడా పడింది. ఇటవంటి తరుణంలో ఆడంబరంగా కాకుండా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను చేసుకోవలసిన అవసరం వుంది. త్వరలోనే కోవిడ్ పీడ తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది 75వ వేడుక.. అంటే వజ్రోత్సవాలను జరుపుకొంటాము. ఆ వేడుకను మరింత శోభాయమానంగా నిర్వహించుకుందాము. ఒక మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుందామని కోరుకుంటూ… సర్వేజనా సుఖినో భవంతు! – జైహింద్

 823 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *