వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలి.. సర్కారుకు జనసేనాని సూచన

గోదావరి నదికి వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక భూములు, కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. మరో వైపు ఎగువన ఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తతతో తగిన పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి తగిన వైద్య, ఆరోగ్య, వసతులు కల్పించాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచనలు చేశారు.
ఇప్పుడు వస్తున్న వరదలను ప్రత్యేక దృష్టితో చూసి అత్యంత జాగ్రత్తలు అనుసరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందనీ., తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పొజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయన్న విషయాన్ని జనసేనాని ప్రస్తావించారు. ఈ తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. భౌతిక దూరానికి ఆస్కారం ఉండేలా లాంచీలు, మర బోట్లను ఎక్కువ సంఖ్యలో సిద్ధపరచుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచి అక్కడ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా వైరస్ విస్తృతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరన్న పవన్ కల్యాణ్., పంటలు నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 3,037 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *