పవన్ టుడే

This page contains the daily schedule of Power Star Pawan Kalyan

అమ్మోనియం నైట్రేట్ నిల్వల నుంచి విశాఖను కాపాడండి

• విశాఖలో ప్రమాదకర స్థాయిలో నిల్వలు • బీరూట్ ప్రమాదం నేపధ్యంలో జనసేనాని ముందస్తు అప్రమత్తత వరుస ప్రమాదాల నేపధ్యంలో స్టీల్ సిటీ విశాఖపట్నం భద్రతపై చర్చ మొదలైంది. లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన భారీ ప్రమాదం నేపధ్యంలో మరోసారి ఆ చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ నిల్వలలు విశాఖలో ఉన్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందస్తు అప్రమత్తత ప్రకటిస్తూ ఒక …

Read More »

కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలు సమీక్షించాలి

కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయవిదారకం స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై జనసేనాని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా …

Read More »

జనసైనికుడు వెంకట కోటేశ్వరరావు మృతి పట్ల జనసేన అధినేత దిగ్భ్రాంతి

జనసేన పార్టీకి ఎంతో కాలంగా నిబద్దతతో సేవలు అందిస్తున్న జనసైనికుడు వెంకట కోటేశ్వరరావు కరోనా మహమ్మారి భారిన పడి మృతి చెందడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో వివిధ కార్యక్రమాలకు వెంకట కోటేశ్వరరావు ఆహారం అందిస్తూ ఉంటారు. అతని మరణ వార్త జనసేనానిని తీవ్రంగా బాధించింది. విషయం తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన …

Read More »

ప్రధాని మోడీ ఆలోచనల్ని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకువెళ్తాం-సోము వీర్రాజు

• జనసేనానితో మర్యాదపూర్వక భేటీ • ఏపీ నూతనాధ్యక్షునికి జనసేన అధినేత శుభాకాంక్షలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనాధ్యక్షునికి జనసేనాని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సోము వీర్రాజు ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలం పుంజుకుంటుందని ఈ సందర్భంగా పవన్ …

Read More »

ఆ కోరిక తీరకుండానే ఆయన మనల్ని వదిలివెళ్లడం బాధాకరం-పవన్ కల్యాణ్

* అధికారం రెండు వర్గాలకే పరిమితం కారాదని తపించారు * వంగపండు పాటకు మరణం లేదు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో బాధించిందనీ ఓ ప్రకటనలో తెలిపారు. తన స్వరాన్ని భాస్వరం గా మార్చిన ప్రజా గాయకుడిగా వంగపండుని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం రెండు వర్గాల …

Read More »

అమిత్ షాకి కరోనా..త్వరగా కోలుకోవాలంటూ జనసేనాని ప్రార్ధన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా సోకింది.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించినట్టు, పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.. హోంమంత్రికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా …

Read More »

షిప్ యార్డ్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

• అన్ని సంస్థల్లో యుద్ధప్రాతిపదికన సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి • జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ భారీ క్రేన్ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఘటనపై జరిగిన వెంటనే ఆరా తీసిన ఆయన …

Read More »

మూడు రాజధానులకు ఇదా సమయం?

* ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి * ప్రభుత్వానికి జనసేనాని సూచన ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న వేళ మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నాడు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించారన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదనీ, ఈ …

Read More »

రేషన్ డీలర్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి-జనసేనాని డిమాండ్

• బయో మెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి • డీలర్లకు కరోనా బీమా అమలు చేయాలి పేద ప్రజలకు అవసరమైన బియ్యం, పప్పు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేసే రేషన్ డీలర్ల విజ్ఞాపనలపై ప్రభుత్వం స్పందించకపోతే – చివరికి 2 కోట్ల 80 లక్షల మంది పేదలు ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాక్డౌన్ కాలం నుంచి ఇప్పటి వరకూ రేషన్ సరకు …

Read More »

స్వచ్ఛందంగా సేవ చేస్తే దాడులు చేస్తారా? విజయనగరంబిజెపీ-జనసేన అభ్యర్థిపై దాడికి జనసేనాని ఖండన

కరోనా విపత్కాలంలో స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తున్న విజయనగరంకు చెందిన బీజేపీ నాయకుడు కాళ్ల నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కార్పోరేషన్ లో జనసేన-బీజేపీ అభ్యర్ధిగా నారాయణ రావు పోటీలో ఉన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదంలంతా ఖండించాలని జనసేనాని పిలుపు నిచ్చారు. తన విడిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో స్వయంగా ఆయనే పూనుకొని ఆ …

Read More »