పోలీసుల నిర్భంధంలో గండికోట నిర్వాసితులు.. రంగంలోకి జనసేనాని..

  • బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలన్న పవన్
  • ఆందోళనలో పాల్గొన్న జనసేన నాయకులు

గండికోట ఫేస్ 2 నీటి నిల్వ సామర్ధ్యం పెంచే క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, పరిహారం చెల్లించకండా ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసిన సంగంతి తెలిసిందే.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారంలో బాధితులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. రాయలసీమ సంయుక్త కమిటీ కో కన్వీనర్  సుంకర శ్రీనివాస్ ఆ ప్రాంతాని సందర్శించి పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. విషయాన్ని పార్టీ అధినేత  పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అటు ప్రభుత్వం నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు పోలీసు బెఠాలియన్లను రంగంలోకి దించింది. విషయం తెలుసుకున్న జనసేనాని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ప్రజలకు ఇంత అన్యాయం జరిగిందన్న సంకేతాలు బయటకు వెళ్తాన్నారు.. వారికి ముఖ్యమంత్రే భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

అటు తాళ్ల ప్రొద్దటూరు గ్రామంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ద్వితియ శ్రేణి నేతలను, మహిళలను బారీకేడ్లతో నిర్భంధించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు  సుంకర శ్రీనివాస్ మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగిరాకుంటే పార్టీ అధ్యక్షులు రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి  బొలిశెట్టి సత్య తాళ్లప్రొద్దటూరు సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు.  సుంకర శ్రీనివాస్ తో పాటు స్థానిక బీజేపీ మండల కన్వీనర్  శేఖర్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు మాలే శివ,  సురేష్ బాబు,  తోట బాలసుబ్రహ్మణ్యం,  నాగరాజు,  సందీప్ తదితరులు నిర్వాసిత ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

 5,037 total views,  3 views today

Spread the love

About Admin

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *