అనగనగా ఓ వృద్ధ జంట.. ఏడు పదులు దాటిన వయస్సులో కోవిడ్ మహమ్మారి వారిని కభళించింది.. వైరస్ తో పోరాడి గెలిచిన వారు., జీవనం సాగించేందుకు మాత్రం నిత్యపోరాటం చేయకతప్పని పరిస్థితి. ముందూ వెనుకా ఎవరూ లేకపోవడంతో పౌష్టికాహారం తీసుకోవాల్సిన వారు పస్తులు పడుకోవాల్సి వస్తోంది.. ఆ నోటా ఈ నోటా విషయం జనసైనికులకు చేరింది.. జనసేన చొరవతో ఆ వృద్ధ దంపతుల ఇంట వెలుగులు వచ్చాయి. ఆ స్టోరీలోకి వెళ్తే…
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలో పాలంకి లక్ష్మణరావు(70), వెంకట సుబ్బమ్మ అనే వృద్ద దంపతులు నివసిస్తున్నారు. వెనుకా ముందూ చూసే దిక్కులేకపోవడంతో వృద్ధాప్యంలోనూ తమ కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఆ జంటపై విధి కరోనా రూపంలో పంజా విసిరింది. అయితే కోవిడ్ తో పోరాటం చేసి విజయం సాధించిన వారికి ఆ తర్వాత జీవనం భారంగా మారింది. వారు నివాసం ఉంటున్న పూరింటికి కనీసం కరెంటు సదుపాయం లేదు. లక్ష్మయ్యకు ఒక కన్ను కనబడదు, అయన భార్య నడవలేని స్థితిలో ఉన్నారు. ఆ దంపతులు కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు వెంటనే స్పందించారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితో కదిలారు. పార్టీ న్యాయ విభాగానికి చెందిన రాయపూడి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసైనికులంతా కలసి ఆ వృద్ధ దంపతులకు తమవంతు సాయం అందించారు. రాయపూడి వేణు(రూ.4000), తోటనాగరాజు(రూ.1000) కలసి ఆ పూరింటికి విద్యుత్ కనెక్షన్ పెట్టించేందుకు సాయం చేయగా, మిగిలిన జనసైనికులు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందచేశారు. జనసేన పార్టీ చొరవతో దసరా పండుగ రోజు ఆ అనాధ వృద్ధ జంట ఇంట విద్యుత్ కాంతులు వచ్చాయి. జనసైనికులు ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది దాతలు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చి గ్యాస్ కనెక్షన్, వంట సామాగ్రి తదితరాలు సాయం చేశారు. జనసేన పార్టీ తరఫున ఆ జంటకు జీవితకాలం బిడ్డల రూపంలో సాయం చేస్తామని స్థానిక జనసేన శ్రేణులు ఇచ్చిన హామీతో వారి ముఖాల్లో పూసిన వెలుగులు.., దైవస్వరూపాలైన వృద్ధులకు సాయం చేయడంలో మరికొందరిలో స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షిద్దాం.
17,655 total views, 30 views today