పల్లెలకు పాకిన జనసేనాని స్ఫూర్తి.. చెట్లు నాటే పనిలో జనసైనికులు

జనసేన అధినేత  పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు వన సంరక్షణ ఉద్యమంలో మేము సైతం అంటూ భాగస్వాములవుతున్నాయి. జనసేన సిద్ధాంతాలను బలపరుస్తూ గ్రామాల్లో సైతం జనసైనికులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు.  పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాల్లో భాగంగా పవనన్న జనసేన వనమహోత్సవం పేరిట అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎన్.ఆర్.ఐ. విభాగానికి చెందిన  రాగేష్ బొండాడ ఆర్ధిక సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ఆదివారం పామర్రు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్  తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ధూళిపూడిపాలెం గ్రామ జనసేన శ్రేణులు రెండు కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితంతో పాటు రహదారుల పక్కన నీడనిచ్చే జాతులైన వేప, కానుగ తదితర రకాలను ఎంచుకుని మరీ నాటారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా దూళిపూడిపాలెం జనసైనికులు ప్రతినబూనారు.

 4,097 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *