జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. తక్షణం స్పందించిన జనసైన్యం

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉండడంతో అటుగా వెళ్తున్న జగ్గయ్యపేట నియోజకవర్గ జనసైనికులు బాధితులకు ప్రధమ చికిత్స చేసి తక్షణ సాయం అందచేశారు.

పోలీసులు, ఆంబులెన్స్ అక్కడికి చేరుకునే లోపు గాయాలు శుభ్రం చేసి, వారికి మంచినీరు, కొబ్బరి బొండాలు అందచేశారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించడంలోనూ సాయం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నాయకులు బాడిశ మురళీ కృష్ణ స్పందించిన తీరుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

 5,287 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేన కదిలింది.. అనాధ వృద్ధ జంట ఇంట వెలుగులు నింపింది..

అనగనగా ఓ వృద్ధ జంట.. ఏడు పదులు దాటిన వయస్సులో కోవిడ్ మహమ్మారి వారిని కభళించింది.. వైరస్ తో పోరాడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *