పొన్నూరులో వాడవాడకు జనసేన జెండా కార్యక్రమం

• పోస్టర్ విడుదల
క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు జనసేన జెండాను రెపరెపలాడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. వాడ వాడకు జనసేన జెండా పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి బోని పార్వతినాయుడు ఆవిష్కరించారు. పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

 67,223 total views,  421 views today

Spread the love

About Admin

Check Also

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

• GHMC ఎన్నికలపై చర్చ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *