భీమిలిలో చేరికలు.. జనసేన కండువా కప్పుకున్న యువత, మహిళలు

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన వారంతా ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై యువత, మహిళలు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. స్థానిక నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనాని నాయకత్వంలోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్న నమ్మకాన్ని పార్టీలో చేరిన మహిళలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ.. మహిళా సాధికారిత, రేపటి తరం యువ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. జనసేన-బీజేపీల కూటమి బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి పార్టీ నాయకులు బి.వి. కృష్ణయ్య, వీరమహిళ పరిమి భువనేశ్వరిలు అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు సతీష్, వంశీ, కిరణ్, గోపీ, రాజు, రోహిత్, సాయి, కె. సతీష్ తో పాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

 10,011 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *