గ్రామాల్లో వీస్తున్న జనసేన పవనాలు.. పార్టీలోకి పెరుగుతున్న చేరికలు

పెద్దాపురం నియోజకవర్గంలో 100 మంది జాయినింగ్

పంచాయితీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో జనసేన గాలి వీస్తోంది. జనసేన వైపు గ్రామీణ యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. తెలుగుదేశంతో పాటు అధికార వైసీపీ నుంచి సైతం వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరందుకున్న చేరికలే అందుకు నిదర్శనం. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన కీలక మత్స్యకార సంఘం నాయకుడు జనసేన పార్టీలో చేరారు.

తాజాగా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన కాండ్రకోట గ్రామానికి చెందిన 100 మంది యువకులు వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్  తుమ్మల రామస్వామి(బాబు) వారిని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. పంచాది వీరబాబు,  అక్కిశెట్టి చిన్నా,  గవరసాన వినోద్, పడాల దొరబాబు,  పంచాది రామకృష్ణ,  రెడ్డి సురేష్,  గాది రాజా,  గంటా శివ తదితరుల ఆధ్వర్యంలో యువత జనసేనలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులతో పాటు వీర మహిళా విభాగం నేతలు గంటా స్వరూప, సుంకర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

 15,852 total views,  19 views today

Spread the love

About Admin

Check Also

శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *