శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆచారాల ఉల్లంఘనపై జనసేన-బీజేపీ నిరసన

  • ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాల్లో ఆచారాలు, ఆలయ ధర్మాలకు తూట్లు పొడిచే విధంగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివభక్తులు దక్షిణ కాశీగా కొలిచే శ్రీకాళహస్తీశ్వరాలయం గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపనతో మరో వివాదం రాజుకుంది. ఆలయ ఆచారానికి విరుద్దంగా గర్భాలయంలో శివలింగం, నందీశ్వరుడిని ప్రతిష్టించారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో దేవాదాయ శాఖ విచారణకు ఆదేసించింది. అయితే విచారణ తూతూ మంత్రంగా సాగుతుందన్న ఆరోపణల నేపధ్యంలో జనసేన-భారతీయ జనతా పార్టీలు రంగంలోకి దిగాయి.

తిరుపతిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కార్యాలయం వద్ద ఇరు పార్టీల నేతలు నిరసనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో జనసేన-బీజేపీ నేతలు ఆలయంలోకి చొచ్చుకువెళ్లి భజన చేస్తూ ఆందోళన చేపట్టారు. శాస్త్ర విరుద్దంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు అనుమతిచ్చినందుకు బాధ్యుడ్ని చేస్తూ ఆలయ ఈవోని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ బాధ్యులపై 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయంలో అపచారానికి పాల్పడిన వారిపై గడువులోపు చర్యలు తీసుకోకుంటే మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా జనసేన-బీజేపీ నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలా ఆనంద్, భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, జనసేన నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, బాబ్జీ, పగడాల మురళీ, భూనపల్లి మునస్వామి, కొండా రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.

 7,423 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *