అక్రమ అరెస్టులకు నిరసనగా జనసేన-బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి

అంతర్వేది ఘటనపై నిరసన తెలుపుతున్న జనసేన-బీజేపీ కార్యకర్తలు, నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇరు పార్టీలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. పార్టీల ముఖ్యనేతలు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.  కాకినాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టిడికి జనసేన-బీజేపీ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అమలాపురం డివిజన్ పరిధిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ నాయకత్వంలో జనసేన-బీజేపీ నాయకులు పాదయాత్రగా ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లారు. అక్రమ అరెస్టుల పట్ల నిరసన తెలిపారు. అనంతరం స్థానిక ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన సంయుక్త ధర్నాలో జనసేన ఇంఛార్జ్  రెడ్డి అప్పలనాయుడు, పార్టీ నాయకులు  బొత్స మధు,  అల్లు చరణ్,  సరిది రాజేష్,  తేజ్ ప్రవీణ్,  శ్రవణ్ కుమార్,  ఇద్దుం చిరంజీవి, బీజేపీ పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు.

విజయవాడ జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జనసేన-బీజేపీ నేతలు ధర్నా చేపట్టి వినతిపత్రం సమర్పించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్, బీజేపీ నేతలు  రావెల కిషోర్ బాబు తదితరల అధ్వర్యంలో ఇరు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు సైతం జనసేన-బీజేపీ నిరసనలతో అట్టుడికాయి. అంతర్వేది నిరసనల్లో భాగంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్న డిమాండ్ తో వినతి పత్రం సమర్పించాయి.

 5,849 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *