ఆ తల్లిదండ్రులకు బిడ్డనవుతా.. కుప్పం మృతుల కుటుంబాలకు జనసేనాని భరోసా

  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్ధిక సాయం ప్రకటన

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా కటౌట్లు కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు జనసైనికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనసైనికులు మరణం వార్త విన్న జనసేనాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జనసైనికుల మృతి మాటలకు అందని విషాదాన్ని మిగిల్చిందన్నారు.  గుండెలు నిండా తన పట్ల అభిమానం నింపుకొన్న సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తనను కలచి వేసిందన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి  ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది మాటకందని విషాదం అని, ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలనని అన్నారు. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని మాటిచ్చారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటానని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జన సైనికులు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారన్న  సమాచారం ఉందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు ఆదేశించినట్టు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

 15,062 total views,  10 views today

Spread the love

About Admin

Check Also

పోలీసుల నిర్భంధంలో గండికోట నిర్వాసితులు.. రంగంలోకి జనసేనాని..

బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలన్న పవన్ ఆందోళనలో పాల్గొన్న జనసేన నాయకులు గండికోట ఫేస్ 2 నీటి నిల్వ సామర్ధ్యం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *