అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఇంటి వద్ద జనసేనాని ధర్మ పరిరక్షణ దీక్ష

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్దం ఘటన నేపధ్యంలో జనసేన-బీజేపీ సంయుక్తంగా చేపట్టిన ధర్మ పరిరక్షణ దీక్షలో భాగంగా ఉదయం 10 గంటలకు తన నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్ ధరించి గంటపాటు దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షకు సంబంధించి పార్టీ నేతలతో జనసేనాని చర్చించారు. దీక్షకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.  అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టినట్టు ఈ సందర్భంగా పార్టీ నాయకులు అధినేతకు వివరించినట్టు పార్టీ మీడియా విభాగం తెలిపింది.

 3,297 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం

మాజీ రాష్ట్రపతికి జనసేనాని నివాళి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *