మంగళ, శుక్రవారాల్లో ఆడపడుచులు హారతులతో నిరసన తెలపండి..

  • అంతర్వేది రథం దగ్దంపై జనసేనాని స్పందన
  • ఆడపడుచులు రంగంలోకి దిగాలని పిలుపు
  • విశ్రాంత న్యాయ మూర్తితో విచారణకు డిమాండ్

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తితో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తుపై ప్రజలకు నమ్మకం పోయిందన్న ఆయన హిందూ దేవాలయాలు లక్ష్యంగా వరుసగా జరుగుతున్న ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు. మొన్న పిఠాపురం.. నిన్న కొండబిట్రగుంట… ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలు కావన్నారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు… రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మతిస్థిమితం లేనివారి పని.. తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారని విమర్శించారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అంటూ ప్రశ్నించారు.  హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనలను ఇతర మతాల పెద్దలూ ఖండించాలని డిమాండ్ చేశారు. పార్టీ మీడియా విభాగం జరిపిన ఇంటర్వూలో అంతర్వేది ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే సి.బి.ఐ. దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు.

మనకి ఎవరైతే ఓట్లు అనుకుంటారో వారి మనోభావాలే ముఖ్యమా? మిగతా వారంతా మన దేశ ప్రజలు కారా? అంటూ పాలకుల తీరుని ఎండగట్టారు. వాళ్లను ఒక రూ. 2000 ఇచ్చి కొనేసుకోవచ్చా? ఈ ఆలోచన మారాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి.  ఇంట్లో దీపం వెలిగించే ప్రతి భక్తుడు తమ విశ్వాసాలను కాపాడుకోవాలి. మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ప్రజలే చెప్పాలని సూచించారు.  పూజలు, వ్రతాలు చేసే ఆడపడుచులే ధైర్యంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. మంగళ, శుక్రవారాల్లో హారతులు ఇస్తూ మన ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అడుగులు వేయాలని జనసేనాని కోరారు. ఆడపడుచులు ప్రత్యేకించి మంగళవారాలు, శుక్రవారాల్లో ఆడపడుచులంతా నిరసన తెలపాలన్నారు. మీరు బయటకు రాకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. దుర్గామాతను పూజించే నేల ఇదన్న  ఆయన., ఆడపడుచులే ధైర్యం ఇవ్వాలని కోరారు. దయచేసి ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మీరు వచ్చి మీమీ స్థాయిల్లో మనస్ఫూర్తిగా మీ నిరసనల్ని బాహాటంగా తెలియచేయాలని పిలుపు నిచ్చారు.

 3,347 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం

మాజీ రాష్ట్రపతికి జనసేనాని నివాళి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *