- జీ+3 గృహాలు తక్షణం లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క నిరు పేదకు సైతం ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయిందనీ, వారు కట్టించకపోగా అప్పటికే నిర్మించి ఇళ్లను సైతం కేటాయించకుండా లబ్దిదారులను ముప్పుతిప్పలు పెడుతోందని జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త కమిటీ సభ్యురాలు రేఖా గౌడ్ ఆరోపించారు. ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన జీ+3 గృహాలను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట బాధితులు, జనసేన శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ కక్షలకు ప్రజల్ని బలిపశువుల్ని చేస్తున్నారన్నారు. కోట్లాది రూపాయిల ప్రజా ధనంతో నిర్మించిన ఇళ్లను జగన్ రెడ్డి ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాల మధ్య విబేధాలతో ప్రజల మీద పగ తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఇరు పార్టీల వైఖరి కారణంగా పేద వాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితులు దాపురించాయన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను నిరుపయోగంగా మార్చడమే స్వర్ణయుగమా అని ప్రశ్నించారు. నిర్మాణం పూర్తయిన జీ+3 గృహాల కేటాయింపులు సంక్రాంతి లోగా పూర్తి చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ నాయకులు పవన్ కుమార్, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
28,463 total views, 284 views today