శ్రీవారి దర్శనార్థం వచ్చిన సామాన్య భక్తులను ఇబ్బందుల పాల్జేస్తారా?

• ట్రస్టు ఆదాయం కోసం సామాన్య భక్తులను గంటల తరబడి నిలబెడతారా?
• జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ధ్వజం
శుక్రవారం తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం పట్ల జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ విచారం వ్యక్తం చేశారు. రోజు వారీ దర్శనాల సంఖ్య 3 వేల నుంచి 25 వేలకు పెంచినప్పటికీ సామాన్య భక్తుల కోటా మూడు వేలకే పరిమితం చేయడమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ట్రస్టు ఆధాయం కోసం భక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని జనసేన తరపున టీటీడీకి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్న టీటీడీ పాలక మండలి, 30వ తేదీ నుంచి రోజు వారీ దర్శనాల సంఖ్య 25 వేలకు పెంచింది. అందులో సర్వదర్శనం టిక్కెట్లు 3 వేలు మాత్రమే మంజూరు చేయడం పట్ల  కిరణ్ రాయల్ ఆక్షేపించారు.
ట్రస్టు టిక్కెట్లు అధిక సంఖ్యలో జారీ చేస్తూ సర్వదర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులను రోడ్డున నిలబెడుతున్నారని ఆరోపించారు. చలి కాలంలో కూడా రాత్రంతా శ్రీవారి భక్తులు వేచి ఉండి ఉదయం టోకెన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఈ పరిస్థితి చూస్తే… టీటీడీ అధికారులకు ఎలాంటి ప్రణాళిక, ఒక అంచనా లేవని అర్థం అవుతోందన్నారు. వేచి ఉండడం ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనీ, కావున టీటీడీ యాజమాన్యం ఒక స్థలం కాకుండా ఒక నాలుగైదు ప్రాంతాల్లో టోకెన్లు జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దర్శనానికి కొద్ది గంటల ముందు టోకెన్లు ఇస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని  కిరణ్ రాయల్ సూచించారు. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పేద, సామాన్య భక్తులను గౌరవించాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందన్నారు. ఆ బాధ్యతను విస్మరించవద్దని కోరారు. ట్రస్టు టిక్కెట్లు కొనే వారి సేవను తగ్గించి సర్వదర్శనం సక్రమంగా సాగేలా చూడాలన్నారు.

 34,025 total views,  179 views today

Spread the love

About Admin

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *