టైకీ ప్రమాద బాధితులకు మద్దతుగా జనసేన ఆందోళన

కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఆటోనగర్ లో టైకీ పరిశ్రమ ప్రమాద బాధితుల కోసం జనసేన పార్టీ రోడ్డెక్కింది. బాధితులకు అండగా నిలచి యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ఆ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు గంటల పాటు ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించి ధర్నాకు సైతం దిగారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ యాజమాన్యం అందుబాటులో లేదని తెలుసుకున్న ఆయన, వెంటనే గాయాలపాలయిన కార్మికులను కలిసేందుకు గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లారు. వారి యోగక్షేమాలతో పాటు ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరాతీసిన అనంతరం  నానాజీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ప్రజా సంఘాలతో కలసి రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. చివరికి యాజమాన్యం దిగివచ్చి ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు  డేగల సతీష్,  కరెడ్ల గోవింద్, జనసేన నాయకులు  ప్రసాద్ బాబు,  చింతపల్లి బన్నీ,  కర్ని శ్రీనివాస్ నాయుడు ,  కొప్పిశెట్టి శ్రీను,  తాటికాయల బుజ్జి,  పెదకాపు, బస్స సూరిబాబు , కామరాజు, ప్రసాద్,  ఆట్ల సత్యనారాయణ,  చిన్నారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

 10,539 total views,  27 views today

Spread the love

About Admin

Check Also

విజయవాడలో ఓటు వేయనున్న వకీల్ సాబ్.. ఎక్కడంటే..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బుధవారం ఓటు వేయనున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 9వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *