బెజవాడలో అలజడి.. పోతిన మహేష్ సహా జనసేన నేతల అరెస్ట్

  • దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై శాంతియుత నిరసనకు పిలుపు
  • మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నిరసనను అడ్డుకున్న పోలీసులు
  • మహేష్ సహా 41 మంది జనసేన నాయకులపై కేసులు

బెజవాడ దుర్గమ్మ ఆలయం సాక్షిగా జనసేన పార్టీ నేతల అక్రమ అరెస్టు అలజడి రేపింది. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఉత్సవ రథం వెండి సింహాల మాయం నేపధ్యంలో దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద శాంతియుత నిరసనకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పిలుపు ఇచ్చారు.  మహేష్ పిలుపుతో  శనివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంతే సంఖ్యలో పోలీసులు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోతిన మహేష్ సహా పార్టీ నేతల్ని గృహ నిర్భంధం చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. శాంతియుత నిరసన అడ్డుకోవడం అన్యాయం అంటూ జనసేన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోతిన వెంకట మహేష్, అజయ్ వర్మ ఠాకూర్, ఆకుల కిరణ్ కుమార్, బొలిశెట్టి వంశీ, బొలియశెట్టి శ్రీకాంత్, వెన్నా శివశంకర్, తోట సాయి, వీరమహిళలు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి , షేక్ షహీనా, భవానీ సహా 41 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

వీరందరినీ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరీపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. సెక్షన్ 143, 188, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన జనసేన నేతల అరెస్ట్ పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయాలు, దేవతా విగ్రహాలు, రథాలపై దాడులు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం… ఈ దాడులను నిరసిస్తూ ఉన్న జనసేన నాయకులను నిర్బంధించడం  అప్రజాస్వామికమనీ, ఈ దాడులతో పాటు దేవాదాయ శాఖలో అక్రమాల గురించి సమగ్ర విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ వారి వెండి రథం సింహాలు ఏ విధంగా మాయమయ్యాయో దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 3,555 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *