పూతలపట్టులో నిరు పేద మహిళకు జనసేన ఆర్ధిక భరోసా

చేతిలో పవర్ లేకున్నా.. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే స్పందించే గుణంలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కి తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు జనసైనికులు. జీవనోపాధి కరువై తినడానికి తిండిలేక, ఉండడానికి గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు కుల,మతాలకు అతీతంగా తమ వంతు సాయం అందిస్తూ జనసేన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు నిత్యం ఏదో ఒక మూల ఎవరో ఒకరికి సాయం అందిస్తూనే ఉన్నారు.
సోమవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, మాదిరెడ్డిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్రీదేవి అనే నిరు పేద మహిళలకు స్థానిక జనసేన నాయకులు ఆపన్నహస్తం అందించారు. జనసేన పార్టీ తరఫున రూ. 15,000 ఆర్ధిక సాయం అందచేశారు. పూతలపట్టు నియోజకవర్గ నాయకులు  సి. ఎల్. దేవా కిషోర్,  ఓం ప్రకాష్ (JP) ,  ఎంకే వేణు యాదవ్,  నాగార్జున, కిరణ్,  ఢిల్లీ భాష, మున్నా తదితరులు స్వయంగా ఆమెకు చెక్ రూపంలో సాయాన్ని అందచేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

 10,110 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేన కదిలింది.. అనాధ వృద్ధ జంట ఇంట వెలుగులు నింపింది..

అనగనగా ఓ వృద్ధ జంట.. ఏడు పదులు దాటిన వయస్సులో కోవిడ్ మహమ్మారి వారిని కభళించింది.. వైరస్ తో పోరాడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *