పల్లెల్లో పరిమళించి.. పట్టణాల్లో బోణీ కొట్టి..

  • మూడో ప్రత్యామ్నాయం దిశగా దూసుకుపోతున్న జనసేన

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పురపాలక ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకు వెళ్లి ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించింది. ఎన్ని వార్డుల్లో విజయం దక్కింది అన్నది పక్కన పెడితే ఎవరూ ఊహించని స్థాయిలో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు జరిగిన పోరులో సాధించిన ఓట్ శాతంతో మూడో ప్రత్యామ్నాయంగా ప్రజలు తనవైపు చూస్తున్నారన్న విషయాన్ని నిరూపించుకుంది.

పురపాలక ఎన్నికల్లో జనసేన పార్టీ 7 డివిజన్లు, 18 వార్డులు గెలుచుకుంది. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ లో 3 డివిజన్లు,  మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలుల్లో ఒక్కొక్కటి చొప్పున విజయం సాధించింది. మున్సిపాలిటీల విషయానికి వస్తే అత్యధికంగా అమలాపురంలో 6 వార్డులు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 4 వార్డులు, నర్సీపట్నం, రామచంద్రపురం, పెద్దాపురం. జంగారెడ్డిగూడెం, పెడన, నందిగామ, సత్తెనపల్లి, మైదుకూరుల్లో ఒక్కొటి చొప్పున జనసేన ఖాతాలో చేరాయి. జనసేన పార్టీ పోటీ చేసిన వాటిలో అతి తక్కువ మెజారిటీలో ఓటమి పాలయినవే ఎక్కువ. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని మూడో స్థానానికి పరిమితం చేస్తూ ద్వితియ స్థానాన్ని జనసేన అభ్యర్ధులు సాధించారు. వైసీపీ, టీడీపీలు పెద్ద ఎత్తున డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి. వైసీపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి సైతం పాల్పడింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకు వెళ్లిన జనసేన అభ్యర్ధులు ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించారు. పార్టీ సిద్ధాంతాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. గెలుపు శాతం సంగతి పక్కన పెడితే ఓట్ల శాతం పంచాయితీ ఎన్నికలకు మించి  రావడం గమనార్హం. పుర పోరులోనూ సంతృప్తికరమైన ఓట్ల శాతాన్ని  జనసేన పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

సార్వత్రిక ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించిన జనసేన పార్టీ, పంచాయితీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 27 శాతం ఓటర్ల మనసులు గెలుచుకుంది. 1209 పంచాయితీల్లో జనసేన విజయపతాకాన్ని ఎగురవేసింది. 1576 పంచాయితీల్లో ఉప సర్పంచ్ లు, 4,456 వార్డులను కైవశం చేసుకుంది. 70 శాతం పంచాయితీల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. పంచాయితీ ఎన్నికలు ఇచ్చిన ఊపుతో పుర పోరులో జనసేన శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. ఇంటింటికీ జనసేన సిద్ధాంతాలను తీసుకువెళ్లారు. విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీతో స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యువతతో పాటు మహిళలు, వయసు మళ్లిన వృద్ధులు సైతం పోటీకి నిలిచారు. అధికార పార్టీ బెధిరింపులు, ఒత్తిడులను తట్టుకుని అతిసామాన్యులు గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు.

 10,098 total views,  11 views today

Spread the love

About Admin

Check Also

విజయవాడలో ఓటు వేయనున్న వకీల్ సాబ్.. ఎక్కడంటే..

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ బుధవారం ఓటు వేయనున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 9వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *