గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

• GHMC ఎన్నికలపై చర్చ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ నాయకత్వం సన్నాహక సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. వరుసగా రెండో రోజు GHMC పరిధిలోని డివిజనల్ కమిటీలతో పార్టీ నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని వీర మహిళా నేతలతో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్  నేమూరి శంకర్ గౌడ్, పోలిట్ బ్యూరో సభ్యులు  అర్హం ఖాన్, ముఖ్య నేతలు  రామ్ తాళ్లూరి,  రామారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు  రాధారం రాజలింగంలు సమావేశమయ్యారు.
GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగే అంశంతో పాటు వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అందుకు సంబంధించి పార్టీ నాయకత్వం మహిళా నేతలకు పలు సలహాలు, సూచనలు చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా మహిళా నేతలు పార్టీ నాయకత్వానికి తెలియచేశారు.

 26,117 total views,  181 views today

Spread the love

About Admin

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *