టెక్కలి ఏరియా ఆసుపత్రికి జనసేన ప్రాణ వాయువు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ సిలిండర్, నార్మల్ వెంటిలేటర్ తో కూడిన యూనిట్ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో జనసేన శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. వేడుకలకు దూరంగా.. కోవిడ్ రోజులకు అండగా అంటూ జనసేన అధినేత  పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన ప్రారంభించిన ఆక్సిజన్ సిలిండర్ యూనిట్ల వితరణ కొనసాగిస్తున్నారు. మొదటి విడత జిల్లా పెద్దాసుపత్రలకు 400 యూనిట్లు ఇచ్చిన జనసైనికులు, మలి విడత మరో రెండు వందలకు పైగా డొనేట్ చేశారు. ఆ తర్వాత కూడా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్ సీల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించేందుకు గాను ఒక్కో యూనిట్ అందచేస్తున్నారు.

మంగళవారం టెక్కలి ఏరియా ఆసుపత్రికి నియోజకవర్గం జనసేన నాయకులు కణితి కిరణ్ ఆధ్వర్యంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ యూనిట్ ను అందచేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కణితి కేశవరావుకి దీన్ని అందచేశారు. కార్యక్రమంలో సున్నాపల్లి జనసైనికులు ధనరాజ్, నారాయణ, రమేష్, కామేష్,  నర్సిపురం శేఖర్,  ముడిదాన రాంప్రసాద్,  గోనప చందు,  కర్రి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 1,979 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

కరోనాతో ఉపాధి కోల్పోయిన కార్యకర్తలకు జనసేన ఆసరా

కరోనా విపత్తు అన్ని వర్గాల ప్రజలకు జీవనోపాధిని దూరం చేసింది. ముఖ్యంగా చిరు ఉద్యోగులు, వ్యాపారులు, రోజు కూలీల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *