కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పెడితేగంటి రాఘవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ శనివారం జనసైనికులతో కలసి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తనవంతు రూ. 10, 000 ఆర్ధిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. రాఘవులు మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన హఠాన్మరణం గురించి తెలిసి తీవ్ర మనోవేదనకు గురయినట్టు చెప్పారు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీర మహిళ అంబటి రాజ్యలక్ష్మి, స్థానిక నాయకులు పోలిశెట్టి నవీన్, పచ్చిగల సుధీర్ బాబు, బర్మా అశోక్, తోట గోపి మరియు కపిలేశ్వరపురం జనసైనికులు పాల్గొన్నారు.
17,755 total views, 189 views today