ప్రణబ్ ముఖర్జీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం

  • మాజీ రాష్ట్రపతికి జనసేనాని నివాళి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన దివంగతులయ్యారన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశ రాజకీయాల్లో.. తనదంటూ సొంత ముద్రను కలిగి ఉన్న ప్రణబ్ ముఖర్జీ మరణం.. దేశానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రణబ్ కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి నుంచి రాష్ట్రపతి వరకు దేశానికి ఆయన చేసిన సేవలను పవన్ కొనియాడారు.. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి.. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్ ముఖర్జీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర  ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  రాజకీయాల్లో ఆయనొక విలక్షణమైన ధ్రువతార అంటూ కొనియాడారు.. ఈ దేశం కూడా పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించిన విషయాన్ని జనసేనాని గుర్తు చేశారు. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా.. తన పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వ దినాలలో  ఆ సంప్రదాయాన్ని అనుసరించడం విశేషమన్నారు.  ఆ విలక్షణత తననెంతో ఆకట్టుకొందన్నారు.  ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం.. భవిష్యత్ తరాలకి ఆదర్శనీయం, అనుసరణీయమైనవని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

 2,444 total views,  4 views today

Spread the love

About Admin

Check Also

పోలీసుల నిర్భంధంలో గండికోట నిర్వాసితులు.. రంగంలోకి జనసేనాని..

బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలన్న పవన్ ఆందోళనలో పాల్గొన్న జనసేన నాయకులు గండికోట ఫేస్ 2 నీటి నిల్వ సామర్ధ్యం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *