బెజవాడలో అక్కడ ఓడితే.. ఆ మంత్రి గారి పదవికి మూడినట్టేనంట..

విజయవాడ నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో విజయాన్ని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉండగా ఈ సారి త్రిముఖ పోటీ సాగుతోంది. రాజధాని నగరం కావడంతో పట్టుకోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార వైసీపీ ఎలాగయినా పట్టు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆశతో ఉంటే, ప్రతిపక్షం ఇంట్లో ఈగల మోతతో సతమతమవుతోంది. ఈ రెండు పార్టీలకు జనసేన పార్టీ కామన్ శత్రవుగా మారింది. మొత్తం 38 డివిజన్లలో బరిలోకి దిగిన జనసేన అభ్యర్ధులు ప్రత్యర్ధులను వణికిస్తున్నారు. 26 డివిజన్లలో బరిలోకి దిగిన మిత్రపక్షం బీజేపీ విజయం కోసం కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ రెండు ప్రధాన పార్టీలకు ఓటమి భయం పట్టుకుంది.

ముఖ్యంగా అధికార వైసీపీ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నగరానికి చెందిన మంత్రి, శాసన సభ్యులకు ముఖ్యమంత్రి టార్గెట్లు పెట్టారంట. ఉన్న వనరులన్నింటినీ పూర్తిగా వినియోగించుకోవాలనీ ఖచ్చితంగా వీలయినన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని హుకుం జారీ చేసినట్టు వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కొన్ని స్థానాలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ స్థానాల్లో గెలిపించకపోతే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగారి పదవి వూడడం దాదాపు ఖాయం అంట. ఆ విషయాన్ని స్వయంగా మంత్రి గారే ప్రత్యర్ధులకు బేరాలు పెట్టే సమయంలో బయటపెట్టారంట. నామినేషన్లు ఉపసంహరించుకోవాలనీ, పదవులు ఇస్తామనీ ఆశ చూపడం, భయపెట్టడం, ఏదీ కుదరకపోతే నా పదవి పోతుంది బాబు అని బ్రతిమలాడడం చేసినట్టు సమాచారం.

గతంలో ఫ్లోర్ లీడర్ గా పని చేసిన బండి పుణ్యశీల ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి సన్నిహితుల నుంచో కుటుంబ సభ్యుల నుంచో ఆదేశాలు వచ్చాయంట. అయితే 34వ విడిజన్ లో గతంలో కార్పోరేటర్ గా పని చేసిన ఆకుల కిరణ్ కుమార్ భార్య బరిలో రాధారాణి జనసేన పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కిరణ్ కుమార్ గతంలో కార్పోరేటర్ గా పని చేసినప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కార్పోరేటర్ గా నిజాయితీగా చేపట్టిన ప్రజాసేవ రాధారాణికి విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి. అదే సమయంలో పుణ్యశీల ప్రజల్లో కొంత మేర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉండడంతో మంత్రి గారు సంకటంలో పడ్డారు.

దీంతో పాటు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ బరిలోకి దిగిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అంతేకాదు చాలా స్థానాల్లో ప్రజలు జనసేన వైపే మొగ్గుతుండడంతో మంత్రి గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆలయాల మీద జరిగిన దాడులు, దుర్గ గుడిలో జరుగుతున్న అవినీతి తదితర అంశాలు ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన నేపధ్యంలో దాదాపు పదవి మీద ఆశలు గల్లంతయినట్టే అన్న టాక్ బెజవాడలో జోరందుకుంది.

 12,937 total views,  11 views today

Spread the love

About Admin

Check Also

పింక్ డైమండ్ నీ పంచుకున్నారా? ష్..గప్ చుప్..

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథం దగ్గం ఘటనతో దేవుడికే నామాలు పెడుతున్న మన నాయకుల ఘనత మరోసారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *