జనసేన వైపు గిరి’జనం’.. నెల్లూరులో పలువురి చేరికలు..

జనసేన పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు.  పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న నిబద్దతే అందుకు కారణం. ఒక్కొక్కరుగా వచ్చి జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. జనసేనలో చేరుతున్న వారిలో యువతతో పాటు అనుభవజ్ఞులు సైతం ఉంటున్నారు. పంచాయితీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ చేరికలు రోజు రోజుకూ మరింతగా ఊపందుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రజలకు న్యాయం చేయలేని నాయకత్వాన్ని వదిలి తామే నాయకులుగా ఎదిగేందుకు జనం మొగ్గుచూపుతున్నారు.
నెల్లూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన పలువురు గిరిజన నాయకులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. స్థానిక 53వ డివిజన్ కి చెందిన వీరిలో జిల్లా స్థాయి గిరిజన నేతగా పేరున్న  పాలకీర్తి రాజా, ఆయన అనుచరులు ఉన్నారు. నియోజకవర్గ జనసేన నాయకులు  కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమక్షంలో వీరంతా జనసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు. గిరిజన నాయకులు, యువతను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన  వినోద్ రెడ్డి., పార్టీ పటిష్టత దిశగా కీలక అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చేరికలు మరింత పెరగనున్నాయని స్పష్టం చేశారు.

 16,111 total views,  11 views today

Spread the love

About Admin

Check Also

శ్రీకాళహస్తీస్వరుని రధోత్సవం సందర్భంగా జనసేవ

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం మరుసటి శ్రీకాళహస్తీశ్వరుడు పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *