హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

  • మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం  మియాపూర్ వెళ్లాల్సి ఉండగా, ఆయన వాహస శ్రేణి వదిలి మెట్రో రైలు ఎక్కరు. మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు జనసేనాని ప్రయాణం సాగింది. మార్గం మధ్యలో ప్రయాణికులతో ముచ్చటించారు. జనసేన అధినేతతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు తదితరులు మెట్రోలో వెళ్లారు.

సాధారణ ప్రయాణీకుని వలె టిక్కెట్ కొనుగోలు చేసి, ఎంట్రీదగ్గర తానే స్వయంగా కూపన్ ఉంచి చెకింగ్ విధానాన్ని పాటిస్తూ స్టేషన్ లోనికి వెళ్లారు. మెట్రో రైలు నుంచి హైదరాబాద్ నగరాన్ని తిలకిస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం జనసేనాని మెట్రో ప్రయాణం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెట్రోలో ద్రాక్షారామం రైతుతో ముచ్చట్లు

ఈ మెట్రో ప్రయాణంలో  భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు.

 122,141 total views,  768 views today

Spread the love

About Admin

Check Also

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

• GHMC ఎన్నికలపై చర్చ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *