బెజవాడ దుర్గమ్మ వెండి రథంలో 3 సింహాలు మాయం?-పోతిన మహేష్

  • వెండి రథం వెంటనే భక్తులకు, మీడియాకు చూపాలి
  • వెండి సింహాలు ఏమయ్యాయో తేల్చాలి
  • జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్

హిందూ దేవాలయాల రథాల దగ్గం రాష్ట్రంలో ఇప్పటికే హాట్ టాపిగ్గా ఉండగా., ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ రథంలో సింహాలు మాయమయ్యాయన్న వార్త ఇప్పుడు దావానలంలా వ్యాపించింది. రంగంలోకి దిగిన జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వెండి ఉత్సవ రథాన్ని వెంటనే భక్తులకు చూపాలని డిమాండ్ చేశారు. మూడు వెండి సింహాలు ఉన్నాయా? ఉంటే చూపడానికి, లేదా చూసి చెప్పడానికి మూడు రోజుల గడువు ఎందుకో చెప్పాలని ఆలయ అధికారులను నిలదీశారు.

మూడు వెండి సింహాలు మాయమై ఉంటే అది మంత్రి వెల్లంపల్లి స్నేహితుడి నిర్వహణలో ఉన్న మ్యాక్స్ సెక్యూరిటీస్ వైఫల్యమా? లేక మంత్రి బినామీగా విధులు నిర్వహిస్తున్న ఈవో సురేష్ బాబు చేతివాటమా? అంటూ మహేష్ ప్రశ్నించారు. ఈవో ఆ విషయం మాకేం తెలియదు అనడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల సమయం ఇస్తే కొత్త సింహాలు తయారు చేయించి తెస్తారా? అంటూ మహేష్ ధ్వజమెత్తారు. తేనెపట్టు అంటూ అంతర్వేది రథంపై కబుర్లు చెప్పిన వెల్లంపల్లి, వెండి రథాల మాయంపై ఎలాంటి కాకమ్మ కబుర్లు చెబుతారో చూడాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రథాలకు  సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ,నిఘా పెట్టామన్న మంత్రి., ఇంటి ముందున్న అమ్మవారి గుడిలో వెండి రథానికి భద్రత కల్పించలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఎంత అసమర్ధ దేవాదాయశాఖ మంత్రో మరోమారు రుజువైందన్నారు.

రేపు ఉదయం భక్తులకు, మీడియాకు రథం తెరిచి వెండి విగ్రహాలు ఉన్నాయా? లేదో చూపాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరుగుతున్న వరుస ఘటనలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనీ., ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలని అసమర్ధ, అవినీతి మంత్రి వెల్లంపల్లిని బర్త్ రఫ్ చేసి హిందువుల మనోభావాలు కాపాడాలని మహేష్ కోరారు.

 5,492 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *